xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
జాతీయం

సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్ తన సత్తా చూపింది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

28-09-2026 10:27
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో మాటలు పంచుకునే మన్‌ కీ బాత్ కార్యక్రమం ఈరోజు ప్రసారమైంది. ఈ సందర్భంగా భారత్ చారిత్రాత్మక విజయం సర్జికల్ స్ట్రైక్‌ని గుర్తు చేసుకున్నారు. ఉగ్రదాడుల కారణంగా భారతదేశం చాలా కాలం పాటు బాధపడిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
xPress24, Delhi, September 27, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులో మాటలు పంచుకునే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నేడు ప్రసారమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆనాటి చారిత్రాత్మక విజయం సర్జికల్ స్ట్రైక్‌ని గుర్తు చేసుకున్నారు. భారతదేశం ఈ విజయం సాధించి రేపటికి పదేళ్లు పూర్తవుతుందన్నారు. పదేళ్ళ క్రితం సెప్టెంబర్  28-29, 2016లో భారతీయ సేన పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్ చేసిందనీ.. ఎల్ఓసీకి అటు పక్కకు వెళ్ళి మన వీర సైనికులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను చూసి ప్రపంచం ఆశ్చర్యపోయిందని ప్రధాని అన్నారు. ఉగ్రవాద విధానానికి తన వ్యతిరేకతని భారత్ యావత్ ప్రపంచానికి సర్జికల్ స్ర్టైక్ ద్వారా  నిర్భయంగా, ఒక కొత్త ఉదాహరణగా చూపెట్టిందన్నారు. ఉగ్రవాద దాడుల కారణంగా భారతదేశం చాలా కాలం పాటు ఎంతో బాధపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కష్టానికి జవాబుగా మన నిర్ణయాత్మక ప్రతిస్పందనే ఈ సర్జికల్ స్ట్రైక్ అన్నారు. గత పదేళ్ళలో బాలాకోట్ మీద జరిగిన ఎయిర్ స్ట్రైక్ నుండీ ఆపరేషన్ సింధూర్ వరకూ భారతదేశం మాటిమాటికీ స్పష్టంగా చెప్తూనే ఉందనీ,.. ఉగ్రవాదులు భారతదేశం వైపుకి కన్నెత్తి చూస్తే, దానికి దీటైన సమాధానం ఇస్తామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాద దాడులు చాలా కాలం వరకూ భారతదేశానికి బాధని కలిగించాయన్నారు. ఒక సమయంలో అయితే భారతదేశంలో వరుస పేలుళ్ళు చాల సామాన్యమైన విషయంగా మారిపోయిందని చెప్పారు. సెప్టెంబర్, 13 -  2008 లో ఢిల్లీలో జరిగిన వరుస పేలుళ్ళలో అనేకమంది సామాన్యులు చనిపోయారనీ.. దానికి కొద్ది వారాల తరువాత  ముంబయ్ లో 26/11 నాటి అతిపెద్ద దాడి జరిగిందని తెలిపారు. ఇదివరకూ కూడా ప్రతి ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్ పై విచారణ జరపాల్సిందిగా కోరేవారు కాని దానిని పెద్దగా పట్టించుకునేవారు కాదన్నారు. కాలం గడిచేదాకా వేచి చూశేవారనీ.. కానీ ఇప్పుడు, నేటి భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ పాలసీ ప్రకారం నడుచుకుంటోందని ప్రధాని తెలిపారు. దాని ఫలితాలను కూడా మనం చూస్తున్నట్లు చెప్పారు. అలాగే 9/11  ఉగ్రవాద దాడి జరిగి ఈ ఏడాదికి పాతికేళ్ళు అవుతాయన్నారు. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో తమ ప్రాణాలను పోగొట్టుకున్న సామాన్య  ప్రజలలో అమెరికన్ల తరువాత భారతీయ ప్రజలే ఎక్కువ మంది ఉన్నారన్నారు. 2014లో ప్రధాని అయిన తరువాత అమెరికా వెళ్ళినప్పుడు, తాను వారికి  శ్రధ్ధాంజలిని అర్పించడానికి నేను న్యూయార్క్ వెళ్లినట్లు చెప్పారు. తిరిగి మరోసారి ఈరోజు కోట్లాది భారతీయుల తరఫున ఆ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ చెప్పారు.

🎥 వీడియో

సర్జికల్ స్ట్రైక్ ద్వారా భారత్ తన సత్తా చూపింది: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.