తెలంగాణ
సూర్యాపేట జిల్లాలో పోలీసు ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ
03-10-2026 14:13
సూర్యాపేట జిల్లాలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం జిల్లా యంత్రాంగం 45 రోజుల ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 4న ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు.
xPress24, SURYAPET, October 3,
పోలీసు ఉద్యోగ ఆశావహులకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం శుభవార్త అందించింది. జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకుల కోసం 45 రోజుల ఉచిత పోలీసు శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 4 తేదీ ఆదివారం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు జిల్లాలో నాలుగు కేంద్రాల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నారు.
నాలుగు వందల మందికి ఉచిత శిక్షణ
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ పిలుపునిచ్చారు. స్క్రీనింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచిన నాలుగు వందల మంది అభ్యర్థులను ఎంపిక చేసి 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించనున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 2 వందల మందికి, కోదాడ పట్టణంలో మరో 2 వందల మంది అభ్యర్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నారు.
నిపుణులతో శిక్షణ, స్టడీ మెటీరియల్
ఈ శిక్షణలో ఇండోర్, అవుట్‌డోర్ అంశాలతో పాటు రాత పరీక్షకు అవసరమైన అన్ని సబ్జెక్టులపై నిష్ణాతులైన శిక్షకులతో తరగతులు నిర్వహిస్తారు. అంతేకాకుండా అభ్యర్థులకు నాణ్యమైన స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నారు. పోలీసు ఉద్యోగమే తమ జీవిత ధ్యేయంగా పెట్టుకున్న యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యంత్రాంగం కోరింది.
బైట్ - తేజస్ నందలాల్ పవార్, జిల్లా కలెక్టర్, సూర్యాపేట