xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ పర్యటన.. గోదావరిలో 965 టీఎంసీల వాటాను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం

23-09-2026 15:21
సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ పర్యటన.. గోదావరిలో 965 టీఎంసీల వాటాను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం
సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాటిపాములలో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, యశ్వంతపూర్ వాగుపై బ్రిడ్జి పనులను పరిశీలించారు. గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 965 టీఎంసీల వాటాను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి, సుందిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసి తుంగతుర్తి ప్రాంతానికి సాగునీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
xPress24, SURYAPET, September 23, సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో నూతనంగా నిర్మించనున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం యశ్వంతపూర్ వాగుపై శరవేగంగా నిర్మాణంలో ఉన్న డ్యామ్ కమ్ బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి జలాల్లో రాజీలేని పోరాటం: మంత్రి ఉత్తమ్ అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తెలంగాణకు కేటాయించిన 965 టీఎంసీల గోదావరి నదీ జలాల వాటాను పరిరక్షించుకోవడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీటిని సమర్థంగా ఒడిసిపడతామని, తుమ్మిడిహెట్టి, సుందిళ్ల బ్యారేజీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి తుంగతుర్తి నియోజకవర్గానికి సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని భరోసా ఇచ్చారు. నీటి వాటాల సాధనలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. సీతారామ, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులతో ముందడుగు సీతారామ ప్రాజెక్టుకు ఇప్పటికే 65 టీఎంసీల నీటి వాటాను దక్కించుకున్నామని, అలాగే సమ్మక్క-సారక్క బ్యారేజీకి సంబంధించి అన్ని కీలక అనుమతులను సాధించామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంత సమగ్ర వ్యవసాయాభివృద్ధి, తాగునీటి అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్, నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. బైట్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి

🎥 వీడియో

సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ పర్యటన.. గోదావరిలో 965 టీఎంసీల వాటాను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.