ఆంధ్రప్రదేశ్
సరస్ మేళాను ప్రారంభించనున్న రాష్ట్రపతి
15-10-2026 09:58

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద నిర్వహిస్తున్న 'జాతీయ సరస్ ఆజీవిక మేళా 2026’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాశ్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఢిల్లీలో కాకుండా జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం ఇదే మొదటిసారి. దేశ వ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి బుధవారం పరిశీలించారు.
xPress24, Vijayawada, October 15,