ఆంధ్రప్రదేశ్
సరస్ మేళాను సందర్శించిన కేంద్రమంత్రి
19-10-2026 09:49

విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ మేళా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు మంచి వేదికగా నిలుస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఢిల్లీ వెలుపల తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో సరస్ మేళా నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. విజయవాడ పున్నమి ఘాట్‌లోని మేళా ప్రాంగణాన్ని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్‌తో కలిసి ఆయన నిన్న సందర్శించారు. మరోవైపు, భారతదేశంలోని చైనా రాయబారి జు ఫెయిహాంగ్ కూడా జాతీయ సరస్ మేళాను సందర్శించారు. గ్రామీణ మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తుల్లోని నైపుణ్యం, సృజనాత్మకత తనను ఆకట్టుకున్నాయని ఆయన ప్రశంసించారు.
xPress24, Vijayawada, October 19,