తెలంగాణ
సిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్
01-10-2026 17:39

కేటీఆర్‌తో పాటు కేసీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావుల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిరిసిల్ల బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. సభకు ముందు మంత్రులు, కార్యకర్తలతో కలిసి 3 కి.మీ. పాదయాత్ర నిర్వహించిన సీఎం, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కేసీఆర్ గతంలో చేనేత, గీత కార్మికులను ఆదుకుంటామని, వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. BRS పదేళ్లలో రూ.2,234 కోట్లు ఖర్చుచేస్తే, తమ ప్రజా ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే రూ.1,730 కోట్ల నిధులు ఇచ్చిందని తెలిపారు. ఆలయాల అభివృద్ధి, యంగ్ ఇండియా స్కూళ్లు, పోలీస్ స్టేషన్ల నిర్మాణం, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలను చేపడుతున్నామని సీఎం స్పష్టం చేశారు.
xPress24, HYDERABAD, October 1,