xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
తెలంగాణ

సిరిసిల్లలో భూ దోపిడీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ

28-09-2026 14:25
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూదోపిడీ జరిగిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, September 28, ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  బహిరంగ లేఖ రాశారు.  సిరిసిల్లలో 8 వేల ఎకరాల భూదోపిడీ జరిగిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలపై ప్రభుత్వం అధికారికంగా శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో... శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాతే సిరిసిల్ల గడ్డపై అడుగుపెట్టాలన్నారు. సిరిసిల్లలో వేల ఎకరాలు దోచుకున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదన్న కేటీఆర్.. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ 8 వేల ఎకరాల దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలన్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని లేఖలో ప్రశ్నించారు. ఆరోపణలను ఆధారాలతో నిరూపించలేకపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రభుత్వం నుంచి రావలసిన సుమారు 60 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  నిలిచిపోయిన నేతన్న బీమా, రైతు బీమా పథకాలను తక్షణమే పునరుద్ధరించి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

🎥 వీడియో

సిరిసిల్లలో భూ దోపిడీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.