xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

01-10-2026 17:21
సాలూరు పట్టణాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు.
xPress24, Saluru, October 1, సాలూరు, అక్టోబర్ 1: సాలూరు పట్టణాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు, ప్రజలు సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని రైతుబజార్ పరిసరాల్లో నిర్వహించిన ‘ఏక్ దిన్–ఏక్ ఘంట’ పారిశుధ్య కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి స్వయంగా పారిశుధ్య పనులు చేపట్టారు. పార, చీపురు పట్టి చెత్తను తొలగిస్తూ శ్రమదానం చేశారు. అనంతరం స్థానిక వ్యాపారులు, ప్రజలకు కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించి, వారితో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ఏక్ దిన్–ఏక్ ఘంట’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట సమయాన్ని పారిశుధ్య కార్యక్రమాలకు కేటాయించాలని మంత్రి సూచించారు. పట్టణంలో ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో సాలూరును పరిశుభ్రమైన, చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలని ఆమె కోరారు.

🎥 వీడియో

సాలూరును చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దాలి

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.