తెలంగాణ
సేవా సంకల్ప్ అభియాన్ భాగంగా ఉపాధ్యాయుల సేవా కార్యక్రమాలు
05-10-2026 09:36
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 'సేవా సంకల్ప అభియాన్' నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తెలిపారు.
xPress24, Karimnagar, October 5,
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా "సేవా సంకల్ప అభియాన్" కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) మల్క కొమురయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 12 సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని, మొత్తం 25 ఏళ్ల సుదీర్ఘ పాలనలో భారత్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని కొమురయ్య కొనియాడారు.
2047 నాటికి భారతదేశాన్ని 'వికసిత్ భారత్'గా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ప్రధాని మోదీ సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కొనియాడారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా విభిన్న రకాల సామాజిక, సేవా కార్యక్రమాలను ఈ 'సేవా సంకల్ప అభియాన్' ద్వారా నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.