xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
క్రీడలు

స్వర్ణ పతకం సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోంది: తిలక్ వర్మ

05-10-2026 11:25
స్వర్ణ పతకం సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోంది: తిలక్ వర్మ
హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్ తిలక్ వర్మ..ఆసియా గేమ్స్ క్రికెట్ పురుషుల జట్టు స్వర్ణం సాధించడంపై స్పందించారు.
xPress24, Hyderabad, October 5, జపాన్ వేదికగా జరిగిన 2026 ఏషియన్ గేమ్స్ పురుషుల టీ20 క్రికెట్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని బ్యాక్-టు-బ్యాక్ ఛాంపియన్‌గా నిలిచింది. హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో సాంప్రదాయ ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 211/6 భారీ స్కోరు సాధించగా, ఆ తర్వాత లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 192/6 పరుగులకే పరిమితమైంది. 2023 చైనా ఏషియన్ గేమ్స్ తర్వాత మళ్లీ 2026 జపాన్ వేదికగా కూడా భారత్ తమ బంగారు పతకాన్ని విజయవంతంగా నిలబెట్టుకోవడంతో దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ విజయవంతంగా ముగిసిన అనంతరం భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏషియన్ గేమ్స్‌‌లో వరుసగా రెండోసారి స్వర్ణ పతకం సాధించడం ఎంతో సంతోషాన్నిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. జపాన్‌లో తాము ఆడడం ఇదే తొలిసారి కావడంతో అక్కడి పిచ్, వాతావరణ పరిస్థితులకు అలవాటు పడటం కొంత సవాలుగా అనిపించిందని పేర్కొన్నారు. ఫైనల్ పోరులో తిలక్ వర్మ కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి భారత జట్టు విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.