xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా142 మంది పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణమంత్రి లోకేశ్ గుజరాత్ పర్యటనమత్స్యకార కుటుంబాలకు 50 కేజీల బియ్యం ఉచితంగా ఇవ్వాలని ఆదేశంతుఫాను ప్రభావిత మత్స్యకార కుటుంబాలకు ఉచిత బియ్యంఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఎస్‌సీటీపీసీ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు కొండంత భరోసా
ఆంధ్రప్రదేశ్

సివిల్ కానిస్టేబుళ్ల SCTPCs (Civil) 2025–26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్

26-09-2026 14:46
సివిల్ కానిస్టేబుళ్ల SCTPCs (Civil) 2025–26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్
పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
xPress24, Anantapur, September 26, అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 26: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఆవరణలో సివిల్ కానిస్టేబుళ్ల SCTPCs (Civil) 2025–26 బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు కానిస్టేబుళ్లు మంత్రికి గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. పోలీసు యూనిఫామ్‌ను చూసినప్పుడు ప్రజల్లో భయం కాకుండా నమ్మకం, భద్రతా భావం కలగాలని అన్నారు. సమాజం పట్ల బాధ్యతతో సేవలు అందించడంలో పోలీసు శాఖ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రస్తుతం సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి పోలీసు కానిస్టేబుల్ నిత్య విద్యార్థిగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని సూచించారు. మారుతున్న నేర విధానాలకు అనుగుణంగా సాంకేతికతపై అవగాహన పెంచుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని మంత్రి పేర్కొన్నారు. వాయిస్ బైట్: పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.