తెలంగాణ
హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు
13-10-2026 10:30

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్‌తో ఢిల్లీలో సోమవారం సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రోడ్డు ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం నాలుగు లేన్లుగా ఉన్న రహదారిని ఆరు లేన్లుగా విస్తరించడంతో పాటు, ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలుకు నవంబర్ 11 చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ హామీ ఇచ్చారు.
xPress24, New Delhi, October 13,