తెలంగాణ
హైదరాబాద్‌లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ ప్రారంభం
09-10-2026 16:51

హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ను క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నిన్న ప్రారంభించారు. భారతీయ సంస్కృతి, ఇతిహాసాల్లో విలువిద్యకు విశిష్ట స్థానం ఉందని, ఈ క్రీడ యువతలో ఏకాగ్రత, క్రమశిక్షణను పెంపొందిస్తుందని తెలిపారు. తెలంగాణలో క్రీడల ప్రోత్సహానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్న మంత్రి, ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత చికితా రావుతో పాటు పలువురు ఆర్చరీ క్రీడాకారులను సన్మానించారు.
xPress24, HYDERABAD, October 9,