తెలంగాణ
హైదరాబాద్‌లో ఘనంగా అటుకుల బతుకమ్మ వేడుకలు
12-10-2026 15:44

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లలిత కళా తోరణంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా సాగిన ఈ కార్యక్రమంలో కూచిపూడి నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్ర జానపద కళలు, సంప్రదాయాలను పరిరక్షించి పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఈ ఉత్సవాలను నిర్వహించినట్లు పర్యాటక శాఖ తెలిపింది.
xPress24, HYDERABAD, October 12,