తెలంగాణ
హైదరాబాద్‌లో ‘పెయింట్ ది సిటీ పింక్’ ప్రచారం
01-10-2026 17:34

రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ చేపట్టిన 18వ 'పెయింట్ ది సిటీ పింక్' ప్రచారానికి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా మద్దతు ప్రకటించారు. ఇందులో భాగంగా రాజ్‌భవన్, చార్మినార్ సహా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రముఖ కట్టడాలు గులాబీ కాంతులతో వెలిగాయి. “పెయింట్ ది సిటీ పింక్’ కేవలం భవనాలను వెలిగించడం కాదని.. ఆశ, ధైర్యాన్ని నింపుతూ రొమ్ము క్యాన్సర్‌పై మౌనాన్ని వీడి, ముందస్తు గుర్తింపుతో ప్రాణాలను కాపాడాలనే సందేశాన్ని చాటడమని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. ప్రపంచంలో వరుసగా 18 ఏళ్లుగా ఇలా భవనాలను గులాబీ రంగులోకి మారుస్తున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమేనని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పి. రఘురామ్ తెలిపారు.
xPress24, HYDERABAD, October 1,