xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
తెలంగాణ

హైదరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం – భారీ పోలీసు బందోబస్తు

25-09-2026 15:22
హైదరాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనం – భారీ పోలీసు బందోబస్తు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బాలాపూర్ నుంచి హుస్సేన్‌సాగర్ వరకు 18 కిలోమీటర్ల యాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 28 వేల మంది పోలీసులు, 8వేల 142 మంది అదనపు సిబ్బందితో పాటు 42 ప్లాటూన్లు, 4 RAF, 2 CRPF కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. నిఘా కోసం 10 వేల సీసీ కెమెరాలు, ట్యాంక్‌బండ్ చుట్టూ 100 హైరైజ్ కెమెరాలు, 24 డ్రోన్లతో సాంకేతిక పర్యవేక్షణ చేపట్టారు. మహిళల భద్రత కోసం 26 షీ-టీమ్స్ విధులు నిర్వర్తిస్తున్నాయి. నగరంలో నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ 40కి పైగా క్రేన్లను మోహరించారు. NTR మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌పై రేపు ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో సర్వీసుల సమయాలను రాత్రి 1 గంట వరకు పొడిగించారు.
xPress24, HYDERABAD, September 25,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.