తెలంగాణ
హైదరాబాద్‌లో బిల్ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం: శ్రీధర్‌బాబు
30-09-2026 14:45

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మాదాపూర్ రహేజా మైండ్‌స్పేస్‌లో ప్రముఖ బీ2బీ ప్లాట్‌ఫాం 'బిల్ట్రస్ట్' 450 కోట్ల రూపాయలతో 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 'బిల్ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్'ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్‌లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ-ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, టాస్క్‌లతో కలిసి పనిచేయాలని బిల్ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు.
xPress24, HYDERABAD, September 29,