xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

హైదరాబాద్‌లో సింగరేణి భవన్ ముట్టడికి టీఆర్‌ఎస్ యత్నం

05-10-2026 14:24
హైదరాబాద్‌లో సింగరేణి భవన్ ముట్టడికి టీఆర్‌ఎస్ యత్నం
సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనలో సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
xPress24, Hyderabad, October 5, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా పాల్గొని ఆందోళన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లో కార్మికులకు దక్కాల్సిన వాటాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల శ్రమ ఫలితంగానే సంస్థ లాభ బాటలో పయనిస్తోందని, అందువల్ల లాభాల్లో కార్మికులకు కనీసం 35 శాతం వాటా అందజేయాలని స్పష్టం చేశారు. దీంతో పాటు కార్మికుల ఆరోగ్య, ఉద్యోగ భద్రతకు సంబంధించిన పలు డిమాండ్లను కవిత యాజమాన్యం ముందుంచారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరికీ వేగంగా వైద్య పరీక్షలు నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. నెలకు కనీసం రెండు సార్లు మెడికల్ బోర్డు సమావేశాలను నిర్వహించాలని, అలాగే అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.