ఆంధ్రప్రదేశ్
హార్టికల్చర్ హబ్ కు శంఖుస్థాపన
02-10-2026 09:46

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు రాష్ట్రంలో పర్యటించనున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో లక్ష కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న హార్టీకల్చర్ హబ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణలతో కలిసి ఆమె ఈ రోజు శంఖుస్ధాపన చేయనున్నారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ను ఏర్పాటు పనులకు వీరు శంఖుస్థాపన చేయనున్నారు. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు.
xPress24, Amaravathi, October 2,